
మహిళలకు ప్రభుత్వం పెద్దపీట
● హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద పేట వేస్తోందని హనుమకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీ సర్ రాథోడ్ రమేశ్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో వరంగల్–1 డిపో ఆధ్వర్యంలో మహాలక్ష్మి సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా మహిళా ప్రయాణికులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఆర్డీఓ రమేశ్‌రాథోడ్ బహుమతులు అందించారు. ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లు ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తుండడంతో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ డిప్యూ టీ ఆర్‌ఎం కేశరాజు భానుకిరణ్ మాట్లాడుతూ.. వ రంగల్ రీజియన్‌లో ఇప్పటి వరకు 15.43 కోట్ల మ హిళలు ప్రయాణించినట్లు తెలిపారు. ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల హరిత, అసిస్టెంట్ మేనేజర్లు సీహెచ్ సంతోశ్‌కుమార్, అమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి, సిబ్బంది పాల్గొన్నారు.