
ఆగస్టు 10వరకు రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్ల వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సీఎంఓ కార్యాలయం నుంచి వానాకాలం సాగు, భారీ వర్షాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్‌కార్డుల పంపిణీ వంటి పలు అంశాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, సీతక్క, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సాగు పనులు సజావుగా సాగేందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి, సంధ్యారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీఎంహెచ్‌ఓలు అప్పయ్య, సాంబశివరావు పాల్గొన్నారు.