
తెలుగు విభాగం బీఓఎస్‌గా చిర్ర రాజు
● రిజిస్ట్రార్ పేషీలో జాయినింగ్ రిపోర్టు..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఆ వి భాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు శనివా రం రిజిస్ట్రార్ పేషీలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. తెలుగు విభాగం బీఓఎస్‌గా ఆ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమితులై కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన స్థానంలో చిర్ర రాజును నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. అయితే తనను సంవత్సరం పాటు కొనసాగించాలని మంథిని శంకర్ అదేరోజు వీసీ ప్రతాప్‌రెడ్డి వద్దకు వెళ్లి అడిగారు. దీంతో అక్కడే ఉన్న చిర్ర రాజు.. బీఓఎస్‌గా శంకర్‌ను కొనసాగించాలని చెప్పడంతో ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ అధికారులు చిర్ర రాజు నియామక ఉత్తర్వులు వెనక్కి తీసుకోలేదు. దీంతో శనివారం చిర్ర రాజు తెలుగు విభాగం బీఓఎస్‌గా రిజిస్ట్రార్ పేషీలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. వాస్తవంగా మంథిని శంకర్ నుంచి చిర్ర రాజు బాధ్యతలు స్వీకరించాల్సింటుంది. అలా కాకుండా రిజిస్ట్రార్ పేషీలో జాయినింగ్ రిపోర్టు ఇవ్వడంతో తెలుగు విభాగంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై రిజిస్ట్రార్ రామచంద్రంన‘సాక్షి’ వివరణ కోరగా తాను హైదరాబాద్‌లో ఉన్నానని, చిర్ర రాజు బీఓఎస్‌గా రిపోర్టు రిజిస్ట్రార్ పేషీలో ఇచ్చారని తనకు సమాచారం ఉందన్నారు. ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినప్పుడు శంకర్ తననే కొనసాగించాలని కోరారని, అప్పుడు సరే అని చెప్పిన చిర్ర రాజు.. తాను క్యాంపస్‌లో లేనప్పుడు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారన్నారు. ఈవిషయం వీసీ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

తెలుగు విభాగం బీఓఎస్‌గా చిర్ర రాజు