
విద్యార్థి సంఘాల నిరసన ఉద్రిక్తత
హన్మకొండ: ఈ నెల 23న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం, నిరసన కా ర్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. హనుమకొండలోని కాళోజీ కూడలికి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం తరలివచ్చారు. నిరసనలో భాగంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పూనుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితులు ఉద్రిక్తతంగా తయారయ్యాయి. దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు లాక్కోవడంతో ఆగ్రహించిన వి ద్యార్థి సంఘాల నాయకులు.. కాళోజీ కూడలిలో రో డ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగానే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని విస్మరి స్తోందని విమర్శించారు. ఈనెల 23న చేపట్టనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాచకొండ రంజిత్, జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష, ఏఐఎస్‌బీ జిల్లా కన్వీనర్ రోహిత్, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కన్వీనర్ మాస్ సావిత్రి పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనానికి
వామపక్షాల విద్యార్థి సంఘాల యత్నం
అడ్డుకున్న పోలీసులు..