
యజమానులకు వాహనాల అప్పగింత
హసన్‌పర్తి: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చోరీ అయిన నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు, వాటిని యజమానులకు అప్పగించినట్లు హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మట్టెవాడకు చెందిన ఎం.సాయి కోటేశ్‌కు చెందిన పల్సర్ బైక్ ఫిబ్రవరిలో చోరీకి గురైంది. నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన జాటోతు రవి బైక్ ఈనెల 16న చోరీకి గురైంది. వనపర్తి, భువనగిరి ప్రాంతాలను బాఽధితులకు సంబంధించిన బైక్‌లు దొంగతనానికి గురైనట్లు ఆయా పోలీస్‌స్టేషన్‌ల్లో కేసులు నయోదయ్యాయి. ఆయా బైక్‌లను యజమానులకు అప్పగించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు చోరీకి గురైన 14 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.