భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

Jul 19 2025 3:18 AM | Updated on Jul 19 2025 3:18 AM

భార్యను చంపిన  భర్తకు జీవిత ఖైదు

భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

తీర్పు వెలువరించిన

జడ్జి వీబీ నిర్మలా గీతాంబ

వరంగల్‌ లీగల్‌ : అనుమానంతో భార్యను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని ఇంట్లో పడేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో వరంగల్‌ శివనగర్‌కు చెందిన నేరస్తుడు మైస నరేశ్‌ (23)కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ వరంగల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి వీబీ నిర్మలా గీతాంబ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సిరబోయిన శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. శివనగర్‌కు చెందిన మైస నరేశ్‌కు భూపేశ్‌నగర్‌లో నివసిస్తున్న రమ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నరేశ్‌ ప్లాస్టిక్‌ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా నరేశ్‌ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో రమ్య పిల్లలను తీసుకుని గర్నపల్లిలోని తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. దీంతో డిసెంబర్‌ 31, 2018న గర్నపల్లి వెళ్లి రమ్యని నమ్మించి శివనగర్‌ తీసుకొచ్చాడు. అనంతరం ఇనుప రాడ్‌తో కొట్టగా రమ్యకు గాయాలయ్యాయి. ఆపై ఆమెను కింద పడేసి గొంతు నులిమి చంపి మృతదేహాన్ని ఇంట్లో పడేసి పరారయ్యాడు. పక్కింట్లో అద్దెకుంటున్న వారి ద్వారా విషయం తెలియగా మృతురాలి తల్లి, సోదరి అక్కడికి చేరుకుని మిల్స్‌కాలనీ పోలీసులకు చేయగా వారు కేసు నమోదు చేశారు. విచారణలో సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు.. హత్య చేసినట్లు రుజువుకావడంతో నేరస్తుడు మైస నరేశ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పోలీస్‌ అఽధికారులు పి.దయాకర్‌, ఎం. శ్రీనివాస్‌ కేసును పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ కె.హరికృష్ణ పర్యవేక్షణలో కానిస్టేబుల్‌ ప్రతాప్‌, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

ఐదునెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిన వివాహిత..

చికిత్స పొందుతూ మృతి

భర్త, బావ, తోటికోడలిపై కేసు నమోదు

కాజీపేట: అత్తింటి దాష్టీకంతో తీవ్రంగా కాలిన గా యాలతో దాదాపు 5 నెలలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘట నపై మృతురాలి అన్న ఇమ్మడి విశ్వనాథ్‌ శుక్రవారం కాజీపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మృతురాలి అ న్న, పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్‌ మండలం రాపాకపల్లికి చెందిన ఇమ్మడి సుమలత(38) కు కాజీపేటలోని అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన ఇసంపెల్లి సునీల్‌తో 6 సంవత్సరాల క్రితం వివా హం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు సుహా న్‌ సంతానం. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న సుమలతపై అత్తింటి కుటుంబీకులు టర్పెంట్‌ ఆయిల్‌ పోసి నిప్పు అంటించగా 80 శాతం శరీరం కాలింది. దీంతో చుట్టు పక్కల వారు ఆమెను వరంగల్‌ ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అయిదు నెలలు తీవ్రంగా కాలిన గాయాలతో నరకయాతన ప డిన సుమలత గురువారం రాత్రి కన్నుమూసింది. భర్త ఇసంపెల్లి సునీల్‌, బావ సురేశ్‌, తోటి కోడలు స్వరూప కలిసి తనపై హత్యాయత్నం చేసినట్లు మృతురాలి వాగ్మూలం ఆధారంతోపాటు మృతురాలి అన్న విశ్వనాథం ఫిర్యాదు మేరకు వారిపై కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement