
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తి చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్‌న్స్ హాలులో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, వన మహోత్సవంపై జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వివిధ దశలకు బిల్లుల చెల్లింపునకు ఆధారంగా ఉండేందుకు ఫోటో క్యాప్చర్ చేయాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలను పీఎం ఆవాస్ యోజన యాప్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. ఇందులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. వన మహోత్సవంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సామాజిక ఇంకుడు గుంతలు త్వరగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఈజీఎస్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా అదనపు డీఆర్డీఓ శ్రీనివాసరావు, గృహ నిర్మాణశాఖ అధికారి సిద్ధార్థ నాయక్, సివిల్ సప్లై అధికారి మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మిరమాకాంత్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్