
నేడు ఎన్‌క్లోజర్‌లోకి వైట్ టైగర్
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
న్యూశాయంపేట : హనుమకొండ హంటర్‌రోడ్‌లోని కాకతీయ జువలాజికల్ పార్క్‌లో హైదరాబాద్‌నుంచి తీసుకొచ్చిన తెల్లపులి (వైట్ టైగర్)ను శుక్రవారం ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని జూపార్క్ అధికారులు తెలిపారు.
ఆస్ట్రిచ్‌ను దత్తత తీసుకున్న ‘కుడా’ చైర్మన్
జూపార్క్‌లోని జంతువుల దత్తత పథకంలో భాగంగా ఒక ఆస్ట్రిచ్ పక్షిని ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆరు నెలల పాటు దత్తత తీసుకున్నారు. ఈమేరకు గురువారం జూపార్క్‌కు వెళ్లి ఆస్ట్రిచ్ పక్షి సంరక్షణ, పోషణ కోసం రూ.60వేల చెక్కును జూ పార్క్ రేంజ్ అధికారి మయూరికి అందించారు.
న్యూస్‌రీల్