
విధుల్లో నిర్లక్ష్యం వీడాలి
● టీజీఎస్పీ బెటాలియన్ల డీఐజీ సి.సన్నీ
మామునూరు: టీజీఎస్పీ అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిరంతర అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీ పటాలియన్ల డీఐజీ సి.సన్నీ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం మామునూరు టీజీ ఎస్పీ 4వ బెటా లియన్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బి.రాంప్రకాష్ అయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం ప లికారు. ఆ తర్వాత మోటార్ ట్రాన్స్‌పోర్ట్, బెటా లియన్ వెల్ఫేర్, హెడ్ క్వార్టర్, యూనిట్ హాస్పిటల్, పెట్రోల్ బంక్, క్యూఎం ఆఫీసులను తనిఖీ చేసి వాటి నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించకూడదని తెలియజేశారు. అసిస్టెంట్ కమాండెంట్లు కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్ రావు, వీరన్న, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.