
ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ!
సాక్షిప్రతినిధి, వరంగల్ :
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లనా సందిగ్ధత నెలకొంది.
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించిన అధికారులు ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్లు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌లకు వర్తిస్తుంది. గవర్నర్ సంతకం కాగానే.. ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. ఇందుకు మరో వారం, పది రోజులు పట్టినా.. వచ్చే నెల మొదటి, రెండో వారంలో నోటిఫికేషన్ రావొ చ్చన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు సంకేతాలు అందినట్లు కూడా చెబుతున్నారు.
ఆ తర్వాతే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు
‘స్థానిక’ పోరుకు
సర్కారు సమాయత్తం
ఉమ్మడి వరంగల్‌లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ,
పంచాయతీ స్థానాల వెల్లడి
వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో నోటిఫికేషన్?