
ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులపై సమీక్ష
న్యూశాయంపేట: వరంగల్ నగరాభివృద్ధిలో భాగంగా ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులపై వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యశారద బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖిలావరంగల్, ఉర్సు, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల్లో చేపట్టిన ఇన్నర్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోయిన వారికి త్వరగా పరిహారం ఇప్పించాలని డివిజనల్ రెవెన్యూ అధికారి, తహసీల్దార్లను ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టీపీఓ అజిత్‌రె డ్డి, కేఎంటీపీ జెడ్‌ఎం స్వామి, అధికారులున్నారు.