
నిట్ వరంగల్‌లో బాంబు కలకలం
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో బాంబు కలకలం సృష్టించింది. నిట్‌ను మానవ బాంబునై పే లుస్తానంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నిట్ వరంగల్‌కు చెందిన గ్రూప్‌లో మూడు రోజుల క్రితం ఈమెయిల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై యాజమాన్యం అప్రమత్తమైంది. శని, ఆదివారాలు సెలవు దినాలుకావడంతో సోమవారం తేరుకుంది. మెయిల్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి.. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో మాట్లాడి క్యాంపస్‌లోని మెయిన్ బిల్డింగ్‌తో పాటు వివిధ ప్రాంతాలను బాంబు స్వ్యాడ్‌తో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బాంబు లభించకపోవడంతో యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఫేక్ ఈమెయిల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.