కబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా | - | Sakshi
Sakshi News home page

కబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా

Apr 9 2025 1:42 AM | Updated on Apr 9 2025 1:42 AM

కబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా

కబ్జా నిరూపిస్తే రాజీనామా చేస్తా

హన్మకొండ చౌరస్తా: తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కడైనా ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని జి ల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వరంగల్‌ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవునూరు గుట్టల అటవీభూమిలో తాను రెండు వేల ఎకరాలని ఓసారి, 50 ఎకరాలు కబ్జా చేశానని మరో సారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్యలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను కబ్జా చేసినట్లు సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందుంచితే వారి ఇద్దరి ఇళ్లలో గులాం చేయడానికి సిద్ధమని, లేదంటే వారిద్దరు నా ఇంట్లో గులాంగా పని చేయాలని సవాల్‌ విసిరారు. ఆరోపణలు చేసిన నా యకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరంగా చర్యలు వెనుకాడేది లేదని హెచ్చరించారు. వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ, బీసీ సెల్‌ జిల్లా చైర్మన్‌ బొమ్మతి విక్రమ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, పల్ల కొండ సతీశ్‌, నాయకులు పాల్గొన్నారు.

పల్లా, తాటికొండలు క్షమాపణ చెప్పాలి

ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement