హారన్‌ మోగింది.... రెండు గ్రామాల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

హారన్‌ మోగింది.... రెండు గ్రామాల మధ్య ఘర్షణ

Jun 20 2026 10:38 AM | Updated on Jun 20 2026 10:38 AM

మేడికొండూరు: కారు హారన్‌ ఆపకుండా మోగించిన డ్రైవర్‌కు భీమినేనివారిపాలెం గ్రామ యువకుడు హారన్‌ కొట్టొద్దు అని చెప్పడం తప్పుగా అనిపించింది. ఫలితంగా కారు డ్రైవర్‌ తన సొంత గ్రామమైన పెదకూరపాడు నుంచి సుమారు 20 మంది పైగా యువకులను పిలిపించుకొని భీమినేనివారిపాలెం గ్రామంలో యువకునిపై దాడికి దిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు నుంచి సిరిపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు భీమినేనివారిపాలెం క్రాస్‌ రోడ్డు వద్ద మలుపు తిప్పి బస్సులో నుంచి దిగే ప్యాసింజర్లను ఎక్కించుకునే క్రమంలో బస్సు ఆపారు. పెదకూరపాడు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుకు హారన్‌ ఆపకుండా మోగిస్తున్నారు. దీంతో భీమినేనివారిపాలెం యువకుడు బస్సు నుంచి ప్యాసింజర్లు దిగుతున్నారని ఒక్క నిమిషంలో బస్సు వెళ/్లపోతుందని కనుక మీరు హారం మోగించవద్దంటూ కోరాడు. హారన్‌ కొట్టడం వల్ల నీకు ఇబ్బంది ఏంటని కారు డ్రైవర్‌ యువకుని ప్రశ్నిస్తుండగా కోపంతో ఊగిపోతున్న కారులోని మహిళ భీమినేనివారిపాలెం గ్రామ యువకుడిపై చేయి చేసుకుంది. గొడవ పెద్దదవుతుండటంతో గ్రామస్తులు సర్ది చెప్పి ఇరువురిని పంపించారు. అయితే పెదకూరపాడు గ్రామం నుంచి సుమారు 25 మంది పైగా బైకులపై కరల్రతో భీమినేనివారిపాలెం గ్రామం వచ్చారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆ యువకుడిని క్రాస్‌ రోడ్‌ సమీపంలో ఉన్న షాపులో ఉంచి తలుపులు వేశారు. పెదకూరపాడు గ్రామస్తులు షాపు ధ్వంసం చేసి తలుపులు నెట్టుకొని లోపల ఉన్న యువకుడిని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని తమను ఎవరు ఏమి చేయలేరని దుర్భాషలాడుతూ గ్రామంలో వీరంగం వేశారు. విషయం తెలుసుకున్న మేడికొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదర కొట్టారు. భీమినేనివారిపాలెం గ్రామ యువకుడి ఫిర్యాదుతో మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement