బాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌ : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ, డీఏలతోపాటు విద్యారంగ సమస్యలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ చేపట్టిన రెండవ దశ పోరాటంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్‌ వేయని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నతి పాఠశాలకు గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుని తో పాటు పీఈటీ పోస్టులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టెట్‌ నుంచి సీనియర్‌ టీచర్స్‌కి మినహాయింపు, పీఎస్‌ ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి బదిలీలలో వారి సబ్జెక్ట్‌లో అవకాశం ఇవ్వాలన్నారు. గుంటూరు జిల్లా ఏపీజేఏసీ చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్‌ సయ్యద్‌ చాంద్‌ బాషా, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నాగరాజు, ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఖాలీద్‌, జిల్లా నాయకులు పి.పార్వతీ, పి.లక్ష్మీనారాయణ, జి.శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, పచ్చల శివరామకృష్ణ, కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిలర్లు సాయి లక్ష్మి, కె.రమేశ్‌, ఏపీఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్యాం సుందర్‌ శ్రీనివాస్‌, నగర శాఖ అధ్యక్షుడు కళ్యాణ్‌, వి.కిషోర్‌ షా, శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు సిద్దిక్‌, బాలరాజు, వి.కిషోర్‌ షా, ఆదినారాయణ, రమాదేవి, విజయశ్రీ, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement