వైభవంగా కోటి కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కోటి కుంకుమార్చన

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్ర చైత్ర మాస అమావాస్య పురస్కరించకుని మహా కుంభాభిషేకంలో భాగంగా కోటి కుంకుమార్చన, సామూహిక లలిత సహస్ర నామ పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్‌శర్మ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి అమ్మవారికి పల్లకీ సేవ ఘనంగా చేశారు. వేదాంతం సునీత మాట్లాడుతూ లలిత సహస్ర పారాయణం విశిష్టతను వివరించారు. ఆలయ చైర్మన్‌ పావులూరి రమేష్‌, ఆలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్‌ శ్రీనివాసవర్మ, జిల్లా సంస్కృతి ప్రముఖ్‌ పొన్నపల్లి సత్యనారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్‌ జంజనం హేమశంకరరావు, తమ్మన సాంబశివరావు, చింతల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త సమాజాల వారు దాస సాహిత్య ప్రాజెక్ట్‌ హరే శ్రీనివాస భజన సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement