ఇంటర్‌ ఫలితాల్లో అక్కాచెల్లెళ్ల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో అక్కాచెల్లెళ్ల ప్రతిభ

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అక్కాచెల్లెళ్లు(ట్విన్స్‌) ఎంఎన్‌వీ అలేఖ్య లావణ్యశ్రీ, ఎంఎన్‌వీ ఆస్రిత రమ్యను జీకేఆర్‌ హైస్కూల్‌ డైరెక్టర్లు జి.కొండారెడ్డి, జి.జనార్ధన్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్‌ హైస్కూల్లో విద్యార్థినులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు తమ పాఠశాలలో చదివిన విద్యార్థినులు ఇంటర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరి, జూనియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు వరుసగా 462, 459 మార్కులు సాధించారని తెలిపారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో వేసిన బలమైన పునాది తాము టెన్త్‌, ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించేందుకు దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం, ఏటీ అగ్రహారం క్యాంపస్‌ల ప్రిన్సిపాల్స్‌ జి.శైలజ, జి.సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇంటర్‌ ఫలితాల్లో

ఉత్తమ మార్కులు

Advertisement
 
Advertisement
Advertisement