జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో రూ.కోట్ల వైద్య పరికరాలు ఉన్నాయని, అత్యాధునిక వైద్య సేవలు కార్పొరేట్‌ ఆసుపత్రికంటే దీటుగా అందిస్తున్నామని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ అన్నారు. ఆసుపత్రిలో మీకోసం మేము కార్యక్రమంలో భాగంగా 73వ వారం రోగులతో ఇంట్రాక్షన్‌ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డాక్టర్‌ యశశ్వి రమణ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఇటీవల కాలంలో రూ. వంద కోట్లతో జింకానా ఎంసీహెచ్‌ భవనం ప్రారంభించామన్నారు. ప్రభుత్వం రూ.30 కోట్ల వైద్య పరికరాలు అందించిందన్నారు. క్యాన్సర్‌, హెచ్‌ఐవీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సంతానం లేనివారికి ఐవీఎఫ్‌ సేవలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కోత, కుట్లు లేని ఆపరేషన్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో ఉన్న రోగులను పరామర్శించేందుకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు ఒకరు, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, రోగుల సహాయకులు దీన్ని గుర్తించి తమకు సహకరించాలన్నారు. ఆహారం తిని ఎక్కడబడితే అక్కడ వేయకుండా డస్ట్‌ బిన్‌లలో వేయాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఆర్‌ఎంఓ శ్రీనివాసరాజు, పాల్గొన్నారు.

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

డాక్టర్‌ యశశ్వి రమణ

Advertisement
 
Advertisement
Advertisement