బాధితులకు 150 మొబైల్‌ ఫోన్లు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బాధితులకు 150 మొబైల్‌ ఫోన్లు అప్పగింత

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

నగరంపాలెం: మొబైల్‌ ఫోన్‌ పోయిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు. సుమారు రూ.30 లక్షలు ఖరీదు చేసే 150 మొబైల్‌ఫోన్లను బాధితులకు శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఈఐఆర్‌లో ఫిర్యాదుతోపాటు అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు. పోగొట్టుకున్న మొబైల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా సుమారు రూ.8.44 కోట్ల విలువైన 4,224 మొబైల్‌ ఫోన్లను ఎటువంటి రుసుం లేకుండా బాధితులకు అప్పగించామని తెలిపారు. మొబైల్‌ ఫోన్లల్లో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దుర్వినియోగం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు మొబైల్‌ఫోన్లల్లో ఎక్కువ నిర్వహిస్తున్నారని, ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానాస్పద కాల్స్‌, సందేశాలకు స్పందించవద్దని చెప్పారు. ఐటీ కోర్‌ సీఐ నిషార్‌బాషా, హెడ్‌ కానిస్టేబుల్‌ కిషోర్‌, కానిస్టేబుళ్లు శ్రీధర్‌, ఇమామ్‌సాహెబ్‌, యాసిన్‌, అరుణ, మానస, సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌, కానిస్టేబుల్‌ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement