పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఐజీ | - | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఐజీ

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

పిడుగురాళ్ల: గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఫైల్స్‌కు సంబంధించిన వివరాలు పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ రెగ్యులర్‌ తనిఖీలలో భాగంగా పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌కు రావటం జరిగిందని తెలిపారు. కొన్ని రికార్డులు పరిశీలించామని, మిగిలినవి కూడా పరిశీలిస్తామని వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ, పిడుగురాళ్ల సీఐ, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement