స్వీయ జనగణనలో వాస్తవాలు వివరించండి
గుంటూరు వెస్ట్: జనగణనలో భాగంగా ప్రజలకు స్వీయ వివరాలు నమోదు చేసే సదుపాయం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు భాగస్వాములై వాస్తవ వివరాలు పొందుపరచడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. గురువారం నుంచి 30వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, సీపీఓ పి.శేష శ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రతి చెరువునూ గుర్తిస్తున్నాం
‘జలధార–జలహారతి’ కింద జిల్లాలో ఉన్న ప్రతి చెరువునూ గుర్తిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీఆర్‌వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం, డ్వామా పీడీ వి.శంకర్, భూగర్భ జలాల శాఖ ఉప సంచాలకులు వందనం పాల్గొన్నారు.