నేను 1.50 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాను. ఎకరాకు సుమారు రూ.50 వేలకు పైగా ఖర్చు చేశా. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎకరాకు 30 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో క్వింటా రూ.1,700 కు బయట మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ లెక్కన ఎకరాకు రూ.21 వేలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికై నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
– కంకిపాటి శ్రీనివాసరాజు,
కౌలు రైతు, కొల్లిపర గ్రామం


