అంతర్జాతీయ షూటర్‌ ముఖేష్‌కు ఘన సన్మానం | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ షూటర్‌ ముఖేష్‌కు ఘన సన్మానం

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): ఇటీవల స్పెయిన్‌లోని గ్రేనాడలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌ పోటీల్లో గుంటూరుకు చెందిన షూటర్‌ ముఖేష్‌ నేలవల్లి, పాలక్‌ల జోడి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి, సరికొత్త ప్రపంచ రికార్డుతోపాటు బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారని ది ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు కొనియాడారు. ముఖేష్‌ తమ అకాడమీని సందర్శించిన నేపథ్యంలో ఆయనను సత్కరించామన్నారు. ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు ప్రపంచస్థాయిలో సరికొత్త రికార్డు నెలకొల్పడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఒలింపిక్స్‌లో కూడా ముకేష్‌ మన రాష్ట్రానికి, దేశానికి బంగారు పతకం అందించాలని ఆకాంక్షించారు. ముఖేష్‌ విజయ రహస్యాలను ఔత్సాహిక షూటర్స్‌ తెలుసుకుని కఠోర సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో అకాడమీ షూటర్లు, తల్లిదండ్రులు పాల్గొని ముకేష్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement