హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్
గుంటూరు ఎడ్యుకేషన్: మహిళల విద్యాభివృద్ధి ద్వారానే సమాజం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ పేర్కొన్నారు. బుధవారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల 84వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారానే విద్యార్థులకు వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితం పట్ల లక్ష్యాలు ఏర్పడతాయని చెప్పారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా చదువుకు సంబంధించిన విషయాలపై ఆసక్తితో కోరుకున్న రంగంలో స్థిరపడాలని కోరారు. మారుతున్న కాలానుగుణంగా మహిళల ప్రాధాన్యత గుర్తెరిగి చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు రావటం మహిళల ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఆర్.జ్యోత్స ్నకుమారి మాట్లాడుతూ 2014లో స్వయం ప్రతిపత్తి సాధించిన కళాశాల యూజీసీ నుంచి మరో పదేళ్లపాటు దానిని కొనసాగిస్తూ అనుమతి పొందిందన్నారు. 3వేల మంది విద్యార్థినిలు 27 శాఖలతో చదువుతోపాటు ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం అకడమిక్, స్పోర్ట్స్, కల్చరల్ విజేతలకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ డాక్టర్ డి.విజయశ్రీ, డాక్టర్ పి విజయలక్ష్మి, డాక్టర్ అపర్ణ సీతారాం పాల్గొన్నారు.
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సీనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. బుధవారం గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంఈసీ విభాగంలో అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేశారని తెలిపారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో డి.లీలానాగదుర్గ 982, వై.తన్విశ్రీ 981, ఎం.ఎల్.వి.నాగయశశ్విని 979, పి.కృష్ణచైతన్య 977, జి.వంశీప్రియ 976, సి.హెచ్.తన్మయి 976, ఎస్.వెంకటసాయి శ్రీరామ్ 974, ఎం.అరుణకిరణ్ 973, ఎస్.మేఘన 972 మార్కులు సాధించారని తెలిపారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎం.షకీర్ 494, పి.రామ్‌చరణ్ తేజ్ 493, వై.పి.వి.శ్రీనివాసరావు 493, రహత్ ఫాతిమా 493, బి.కావ్యశ్రీ 492, సి.హెచ్.ప్రణవి 492, కె.హవీష్ 492, పి.అభినేష్ 492, ఎం.ప్రత్యూష 492, ఎన్.మెహర్‌శ్రీసాన్వి 492, రఫత్ ఫాతిమా 492, కె.జ్యోషిత 490, ఎం.రోహన్ రాజాజీ 490, ఎం.సాత్విక్ 490, జూనియర్ సీఈసీ విభాగంలో ఉమ్ ఈ రేయాన్ 489, సీనియర్ సీఈసీ విభాగంలో డి.బిందురమ్య 912 మార్కులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీమేధ కరస్పాండెంట్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.


