పట్నంబజారు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేక సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియో జకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మండిపడ్డారు. బుధవారం కొత్తపేట పోలీసు స్టేషన్‌లో వై.ఎస్.జగన్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారంచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో మావిగన్ అంశం వై.ఎస్.జగన్ ప్రస్తావించగానే దానిని అడ్డుకోలేక ఏదోఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అసత్యాలు, కల్పితాలు, దూషణాత్మక వీడియోల ద్వారా పచ్చమీడియా సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. ఆయనపైనే కాకుండా కుటుంబ సభ్యులపైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనేక కల్పిత కథనాలు, ఆధారాలు లేని అవాస్తవాలను ఆయన కుటుంబానికి అంటగడుతూ ప్రచారం చేయడం సబబు కాదన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఫిర్యాదుతోపాటు, వైఎస్ జగన్‌పై వచ్చిన అసత్య వీడియోలు, సోషల్ మీడియా స్క్రీన్‌షాట్‌లను జత పరిచారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఫర్జానా, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కీసరి సుబ్బులు, తూర్పు నియోజకవర్గ అధ్యక్షురాలు ఉషారాణి, ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుల్లా మేరి, అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్తెనపల్లి రమణి, వలంటీర్ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు తోటకూర స్వర్ణలత, పార్టీ నేతలు గనిక ఝాన్సీ, రిహానా, సుల్తానా, వెంకాయమ్మ, మరియమ్మ, కుమారి, భాగ్యమ్మ, రాహేలమ్మ, భారతి, అమీనా, నాగరాణి, అచ్చమ్మ, శిరీష పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు
షేక్ నూరిఫాతిమా
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు


