లక్ష్మీపురం: ఆర్పీలు అనేక ఒత్తిడిలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య పనిచేస్తున్నారని వారికి నెల నెల జీతాలు రావడం లేదని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్.రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మెప్మా ఆర్పీల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసరావు అధ్యక్షత మెప్మా పీడీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, ఏడు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి నెలా ఆర్పీలకు జీతాలు 5వ తేదీలోపు చెల్లించాలని, గ్రీటింగ్ విధానం రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంసీపీ యాప్‌ని రద్దు చేయాలని, అర్హత ఉన్న ఆర్పీలను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించాలన్నారు. ఉద్యోగ భద్రత కోసం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కోసం హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెప్మా కార్యాలయ అధికారి ఐబి హనుమంతు నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంకమ్మ, అనూష, ఎస్‌కె పర్వీన్, ఎస్.కె కమీలిబీ, సుమతి, నసురున్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ నాయకుల డిమాండ్
మెప్మా పీడీ కార్యాలయం ఎదుట ధర్నా


