అంబేడ్కర్‌ ఆలోచనలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆలోచనలు స్ఫూర్తిదాయకం

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

అంబేడ్కర్‌ ఆలోచనలు స్ఫూర్తిదాయకం నగరంపాలెం: భారత రాజ్యాంగానికి పునాది వేసిన మహానుభావుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం లాడ్జి కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. సమాజంలో శాంతి, సమానత్వం, న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్‌) హనుమంతు మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను అనుసరించాలని అన్నారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, అధికార సిబ్బంది పాల్గొన్నారు. తొలుత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను నెరవేర్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో..

అంబేడ్కర్‌ జీవితం భావితరాలకు స్ఫూర్తి

కొరిటెపాడు(గుంటూరు): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్యాంక్‌ లైజర్‌ ఆఫీసర్‌ ఉబా ప్రసాద్‌, జనరల్‌ మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలే స్ఫూర్తి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ ఆశయాలే స్ఫూర్తి కావాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా తెలిపారు. మంగళవారం నల్లచెరువు మెయిన్‌ రోడ్డులోని మహావీర్‌ జూనియర్‌ కాలేజీలో నిర్వహిస్తున్న టెన్‌న్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన డీఈఓ సలీమ్‌ బాషా మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనమందరం లౌకికవాదాన్ని కట్టబడి ఉండటం మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు. కార్యక్రమంలో డీవైఈవో జి.ఏసురత్నం, ప్రధానోపాధ్యాయులు మణికుమార్‌, జే శ్రీనివాసరావు, జి హజ్రయ్య, అంబటి ఇమ్మానుయేలు, సత్యం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్‌, ఎ.వెంకట రెడ్డి, ఉర్దూ డీఐ ఖాసీం, శారద, బి.సురేఖ పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

Advertisement
 
Advertisement
Advertisement