అంబటి రాంబాబుకు 35(3) బీఎన్‌ఎస్‌ఎస్‌ నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబుకు 35(3) బీఎన్‌ఎస్‌ఎస్‌ నోటీస్‌

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

అంబటి రాంబాబుకు 35(3) బీఎన్‌ఎస్‌ఎస్‌ నోటీస్‌ గుంరూరు లీగల్‌: వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లి పోలీస్‌ స్టేషనన్‌లో 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి తండ్రి నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై క్రైమ్‌ నెంబర్‌ 25/2026గా కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి దర్యాప్తు అధికారి, వేంపల్లి పోలీస్‌స్టేషన్‌ అధికారులు అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులో సూచించిన విధంగా, నోటీసు స్వీకరించిన నాటి నుంచి వారం రోజుల్లోపు పోలీస్‌స్టేషన్‌న్‌కు హాజరై, బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35 (క్లాస్‌–3) ప్రకారం అవసరమైన విధంగా దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు నోటీసును స్వీకరించినట్లు సమాచారం. నోటీసులో పేర్కొన్న విధంగా తాను నిర్దేశిత కాలవ్యవధిలో పోలీస్‌ స్టేషన్‌న్‌కు హాజరై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని మీడియా ద్వారా వెల్లడించారు. అందువల్ల చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతుందని, సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవటానికి సాక్ష్యాధారాలు ప్రకారంగా ఉంటుందని సమాచారం. సెంట్రల్‌ జోన్‌ సీనియర్‌ టీ–20 విజేత గుంటూరు జిల్లా జట్టు గుంటూరు వెస్ట్‌(క్రీడలు): మూలపాడులోని ఏసీఏ క్రీడా మైదానంలో ఈనెల 11 నుంచి జరిగిన సీనియర్‌ టీ–20 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీల్లో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచిందని జీడీసీఏ త్రీమెన్‌ కమిటీ సభ్యులు టీవీ శివరామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల జట్లపై వరుస విజయాలతో సెంట్రల్‌ జోన్‌ విజేతగా నిలిచిందన్నారు. యువ జట్టు సమష్టిగా ఆడి వరుస విజయాలు నమోదు చేసిందని తెలిపారు. జట్టు కెప్టెన్‌గా ఎస్‌.కే రషీద్‌, కోచ్‌గా సరస్వతిరెడ్డి వ్యవహరించారన్నారు. అద్భుతంగా రాణించిన గుంటూరు జిల్లా జట్టును త్రీమెన్‌ కమిటీ సభ్యులు టీ.వీ.శివరామకృష్ణ, జీవీ శరత్‌బాబు, సీహెచ్‌వీ నాగరాజు అభినందించారు. ఆమంచి విజయభాస్కర్‌ శాస్త్రికి డాక్టరేట్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆగమ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి వాటిపై పరిశోధనాత్మక పుస్తకాలు రాసిన సందర్భంగా బెంగళూరులోని ‘శ్రీవిద్య ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వేదిక్‌ సైన్సెస్‌’ నుంచి గుంటూరు నగరానికి చెందిన ఆమంచి విజయభాస్కర శాస్త్రి మంగళవారం గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. వర్సిటీ కులపతి జే శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్‌ ఎస్‌ఆర్‌ నరసింహమూర్తి చేతుల మీదుగా సత్కారం పొందారు. డాక్టర్‌ విజయభాస్కర్‌ శాస్త్రి మాట్లాడుతూ అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్‌ వేదిక సైన్సెస్‌ అనుబంధంగా ఉన్న బెంగళూరు శ్రీవిద్య వేదిక్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం వారు తమంత తాము గుర్తించి ఈ డాక్టరేట్‌ను అందజేశారని తెలిపారు. గౌరవ డాక్టరేట్‌ అందుకున్న డాక్టర్‌ విజయ భాస్కర్‌శాస్త్రి, కరుణశ్రీ దంపతులకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, మైలవరపు శ్రీనివాసరావు, సామవేదం షణ్ముఖ శర్మ, అన్నదానం చిదంబర శాస్త్రి, పలువురు పీఠాధిపతులు, అర్చక సంఘాలు, బ్రాహ్మణ పరిషత్తులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement