ఇప్పటి వరకు అరెస్టుల్లేవు..
నగరంపాలెం: అర్జీదారుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పీజీఆర్‌ఎస్ భవనంలో సోమవారం పిజిఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల మొరను ఆలకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించాలని పోలీస్ అధికారులకు సూచించారు. 178 మంది ఫిర్యాదులు అందించగా, జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అబ్దుల్‌అజీజ్ (తూర్పు డీఎస్పీ) ఫిర్యాదులు స్వీకరించారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
గతనెల 21న గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్, భాజపా, యువమోర్చా నాయకులు పథకం ప్రకారం కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయంలోని బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోలు పోసి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు తగులబెట్టారు. దీనిపై గతనెల 21న నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ దాడికి సంబంధించి ముందస్తు సమాచారం పోలీసులకు తెలుసునని, అంతేగాక పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు మార్పు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
– షేక్.మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే
మూడు రోజులుగా మా ఐదెకరాల పొలంలో మట్టి తవ్వుకెళ్తున్నారు. పదుల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారు. అదేమని అడిగితే మైనింగ్ చేస్తున్నామని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి చెందిన పొలమని, ఎటువంటి అనుమతుల్లేకుండా ఇష్టానుసారంగా తమ పొలం తవ్వడం ఏంటనేది అర్థం కావడంలేదు. మా ఒక్కరి పొలమే తవ్వుతున్నారు. న్యాయం చేయగలరు.
– నిమ్మగడ్డ ధనలక్ష్మి, శ్రీనివాసరావు, పల్లపాడు, వట్టిచెరుకూరు మండలం.


