నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ–సంపర్క్‌ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది సమస్యలు, వినతులను 8688831470 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. విధుల నిమిత్తం జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు సర్వీస్‌కు సంబంధించి సమస్యలు (పోస్టింగ్‌లు, సెలవులు, సంక్షేమం, విధుల్లో ఒత్తిడి, మెడికల్ రీయింబర్స్ మెంట్, బదిలీలు), విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, డ్యూటీ అవర్స్, వ్యక్తిగత/కుటుంబ సమస్యలు సంబంధించి సూచనలు తెలియజేయాలని అన్నారు. ఈ క్రమంలో లాలాపేట పీఎస్ హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మహిళా కానిస్టేబుల్, పొన్నూరు పట్టణ కానిస్టేబుల్ ఫోన్ల ద్వారా సమస్యలు వివరించారు. ఆయా సమస్యలను ఆలకించిన జిల్లా ఎస్పీ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
13 నుంచి జీజీహెచ్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం
Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM
13 నుంచి జీజీహెచ్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు ఉచిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు నాట్కో సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. పీఐఎన్‌సీసీ అమెరికా అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ జీన్ టాల్బర్ట్, డాక్టర్ కారోల్ హబాక్, డాక్టర్ సమత కడియాల, డాక్టర్ పార్వతి, గుంటూరు వైద్యకళాశాల ఓబీసీ, కమ్యూనిటి మెడిసిన్, అంకాలజి, పాథాలజీ విభాగ నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నుంచి 65 సంవత్సరాల మహిళలకు హెచ్‌పీవీ పరీక్ష ప్రత్యేకంగా చేస్తారన్నారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం 9030044253 నంబర్‌లో సంప్రదించాలన్నారు. గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణలు సిబ్బందిని, సామగ్రిని ఏర్పాటు చేశారన్నారు. శిబిర నిర్వహణకు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, శ్రీ అన్నమయ్య సేవా సమితి తదితర సంస్థలు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ జి.నంద కిషోర్‌లు సహకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎస్పీ– సంపర్క్ ప్రారంభం
Advertisement


