ఉత్సాహంగా న్యాయవాదుల క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా న్యాయవాదుల క్రీడలు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

గుంటూరు లీగల్‌: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. చెస్‌ పోటీల్లో విన్నర్‌గా పి.స్వాతి, రన్నర్‌గా చందనాదేవిలు నిలిచారు. క్యారమ్స్‌ పోటీల్లో విన్నర్‌గా పి.కళ్యాణి, రన్నర్‌గా హరిప్రియ నిలిచారు. మహిళ న్యాయవాదులు క్రీడల్లో చురుగ్గా పాల్గొన్నారు. శనివారం పురుషుల విభాగంలో క్యారమ్స్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 14న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. క్రీడా పోటీలు గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎగ్జిక్యూటీవ్‌ సభ్యుల ఆధ్వర్యంలో, స్పోర్ట్స్‌ అండ్‌కల్చరల్‌ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించబడుతున్నాయి. పోటీలు న్యాయవాదుల్లో క్రీడా స్ఫూర్తి, ఐక్యతను పెంపొందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement