బూత్‌ కమిటీలు బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

బూత్‌ కమిటీలు బలోపేతానికి కృషి

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బూత్‌ కమిటీలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అన్నారు. బుధవారం జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్‌ ఫంక్షన్‌ హాల్లో పార్టీ గుంటూరు జిల్లా బూత్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అంబటి రాంబాబు మాట్లాడుతూ గ్రామస్థాయిలో బూత్‌ కమిటీలు పటిష్టంగా కావడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు సమన్వయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎన్టీఆర్‌ పార్లమెంటు జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, తాడికొండ, పొన్నూరు, గుంటూరు తూర్పు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్‌ నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్‌కుమార్‌, అన్నాబత్తుని శివకుమార్‌, రాష్ట్ర బూత్‌ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్‌, రూత్‌ రాణి, కాకుమాను సదాశివ రెడ్డి, ఈదా సాంబిరెడ్డి, మదన్‌ మోహన్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అంబటి రాంబాబు

Advertisement
 
Advertisement
Advertisement