
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా బెజ్జం అశో
తాడికొండ: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్‌లో తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు కలిపి యూనిట్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా బి.కృష్ణ కిషోర్, సహాయ ఎన్నికల అధికారిగా కె. శేషగిరి రాజు వ్యవహరించారు. 16 మందితో కూడిన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఎన్నికల పరిశీలకుడిగా కె. విజయ్ బాబు వ్యవహరించారు. అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ కుమార్, సహ అధ్యక్షుడిగా కె. రవిబాబు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, ఎ. లలిత కుమారి, ఇ. చంద్రబాబు, పి. మల్లికార్జున రావు, మహిళా ఉపాధ్యక్షులుగా సీహెచ్ శారదాదేవి, కార్యదర్శిగా షేక్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ డి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా వి. రామాంజనేయులు, డి.అరుణకుమార్, బి.రాంబాబు, పి.అంకమ్మరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.నాగమణి, కోశాధికారిగా ఎ.పూర్ణయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్. ఏసునాథరావులు ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారని ఎన్నికల అధికారి ప్రకటించారు. అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఏపీఎన్జీజీవో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ హాజరయ్యారు. సభ్యులను పూలమాలలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి.డి. నాయక్, ఎస్.వెంకటరెడ్డి సత్తెనపల్లి యూనిట్ అధ్యక్షుడు మణిరావు, అమరావతి యూనిట్ మాజీ అధ్యక్షుడు రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.