
ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యుడిగా ఆస్కార్ వినోద్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ సభ్యునిగా గుంటూరుకు చెందిన మాజీ రంజీ ఆటగాడు డి.ఆస్కార్ వినోద్ కుమార్ (ప్లేయర్స్ రిప్రజెంటేషన్) ఎంపికయ్యారని గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు యు.మహతీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికల్లో వినోద్‌తోపాటు బీసీసీఐ నిర్వహించిన ఎన్నికల్లో ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యునిగా మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరీనాఽథ్ ఎన్నికయ్యారన్నారు. లెఫ్ట్ హ్యాండరైన వినోద్ కుమార్ గుంటూరులోనే తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989–96 మధ్య ఆంధ్ర జట్టు తరఫున 21 రంజీ మ్యాచ్‌లతోపాటు పలు టోర్నమెంట్‌లలో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా మహతీశంకర్, వి.అర్జున్, బి.సుధాకర్‌లు అభినందనలు తెలిపారు.