
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
హస్తకళల డిజైనర్ మృతి హాస్టల్ వార్డెన్‌కు తీవ్ర గాయాలు
మాచర్ల రూరల్: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల డిజైనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లి కుడి కాలువ సమీపంలోని మాచర్ల–సాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరులోని హస్తకళల వారికి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ట్రైనర్‌లు ఎస్.సుగుణరాజు, ఫిలిప్, వంగడ రమేష్ కొత్తూరు నుంచి పోచం నర్సింహారావు అనే వృద్ధుడు ఆటోలో మాచర్ల బయలుదేరారు. ఏడో మైలులోని గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డన్ నాగ మల్లీశ్వరి, మరో వ్యక్తి కూడా ఆటో ఎక్కారు. తాళ్లపల్లి సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల ట్రైనర్ ఎస్.సుగుణరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. వార్డెన్ నాగ మల్లీశ్వరికి, ట్రైనర్ ఫిలిప్‌కు తీవ్ర గాయాలుకాగా వంగడ రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుగుణరాజుకు వివాహం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురిసౌత్ ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
నరసరావుపేటరూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. కాకాని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్‌కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్‌కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో