
నవంబరులో బాల కళాప్రభ ఉత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలనంద కేంద్ర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు రుద్ర కళాక్షేత్రం సహకారంతో ‘బాల కళాప్రభ–2025 పేరుతో రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవ, పోటీలను నవంబర్ 8, 9వ తేదీల్లో నిర్వంచనున్నారు. బాలానంద కేంద్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, నడింపల్లి వెంకట గురుదత్‌లు ఈ మేరకు పేర్కొన్నారు. శనివారం బ్రాడీపేట రెండో లైను లోటస్ ఆద్య పాఠశాలలో కార్యక్రమాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రుద్ర కళాక్షేత్రం నిర్వాహకుడు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక కూచిపూడి నృత్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు నృత్య ప్రభ (సోలో), నృత్యమణి (గ్రూపు) పేరుతో పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలు, తెలుగు పద్యం, సంస్కృత శ్లోకం, తెలుగులో మాట్లాడదాం, చిత్రలేఖనం, రంగులు వేద్దాం రండి, శాసీ్త్రయ గాత్ర సంగీతం, లలిత గీతాలు, వాద్య సంగీత పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా అంశాల్లో జూనియర్, సీనియర్ విభాగాలుగా పోటీలను నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని వివరించారు. 91826 85890, 89199 81839, 90300 88020, 738215 3390 ఫోను నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లోటస్ ఆద్య పాఠశాల అకడమిక్ డైరెక్టర్ వై.ఉమాదేవి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.