
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని జిల్లా అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళగిరికి చెందిన రేటూరి గౌత్‌ను ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన కె.రామకృష్ణ, తాడికొండకు చెందిన గొంది రవి, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన బండారు మణికంఠ, మంగళగిరికి చెందిన పూసం రామ్‌గోపాలరెడ్డి, తాడికొండకు చెందిన నేలపాటి నాగేంద్రం, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఎస్.ప్రశాంత్, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఈమని శివారెడ్డి, ఎరమాల మురళి, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కర్రా వేణు, జంగా సుందర్‌లను నియమించారు. అదేవిధంగా జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన నంద్యాల ఉదయ్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన ఉడతా శ్రీనివాసరావు, కార్యదర్శిగా బొల్లెద్దు శివాజీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఇబ్రహీంపట్నం వెంకటేశ్వర్లు, మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా తాడికొండకు చెందిన పి.ఫిరోజ్‌ఖాన్, ప్రత్తిపాడుకు చెందిన షేక్ అబ్దుల్ సలాం, ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన షేక్ అబ్దుల్ రజాఖా, తెనాలికి చెందిన షేక్ చాంద్‌బాషా, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన నూర్‌బాషా అలి అబ్బాస్, తాడికొండకు చెందిన షేక్ కరీముల్లా, షేక్ ఖాసీం, తెనాలికి చెందిన సయ్యద్ ఖలీల్, షేక్ ఆసీఫ్, మంగళగిరికి చెందిన షేక్ కిజార్ అల్లా సుభాని, మొహ్మద్ ఇర్ఫాన్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ప్రత్తిపాడుకు చెందిన షేక్ నాగుల్‌మీరా, తాడికొండకు చెందిన షేక్‌హసన్ అహ్మద్, మంగళగిరికి చెందిన సయ్యద్ సలాం, షేక్ జమీరా అహ్మద్, తెనాలికి చెందిన షేక్ బదుల్లాలను నియమించారు. వీరితోపాటు రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన పోరెడ్డి బాలిరెడ్డి, కార్యదర్శులుగా దండా కోటిరెడ్డి, ప్రత్తిపాడుకు చెందిన నెల్లూరి బాలకృష్ణ, ఎగ్జిక్యూటీవ్‌మెంబర్‌గా తాడికొండకు చెందిన నాయుడు నాగేశ్వరరావు, ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన జి.ప్రకాష్‌బాబు, ప్రధాన కార్యదర్శులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన ఇమ్మల త్రివేణి, తాడికొండ నియోజవకర్గానికి చెందిన మేకల రవి, తెనాలికి చెందిన కొమ్ము రాయల్, మంగళగిరికి చెందిన కొండూరు శేషయ్య, కార్యదర్శులుగా గుంటూరు తూర్పుకు చెందిన పోసిపోగు దేవసహాయం, తాడికొండకు చెందిన కఠారి కృష్ణ, తెనాలికి చెందిన అత్తోట కిషోర్‌కుమార్, పొన్నూరుకు చెందిన చందులో ఇమ్మానియేల్, మంగళగిరికి చెందిన పెరికి అంకయ్య, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గుంటూరుకు చెందిన వడ్డె కోటేశ్వరరావు, సంకూరు సురేంద్ర, తాడికొండకు చెందిన తలతోక వెంకటేశ్వర్లు, తెనాలికి చెందిన మువ్వా చందు, పొన్నూరుకు చెందిన బత్తుల వీరయ్య, గుండా బత్తిన శ్యామ్‌సన్, మంగళగిరికి చెందిన కె. పరమేశ్వర దాసు, కె.నాగరత్నం, జిల్లా బూత్ కమిటి ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన సి.హెచ్.భాగ్యారావు, కార్యదర్శిగా పులి ప్రకాష్; జిల్లా కల్చరల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన మేరుగ యోహాన్, కార్యదర్శిగా పులివర్తి నాగరాజు, జిల్లా దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడిగా గుంటూరు తూర్పుకు చెందిన షేక్ బషీర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా చెల్లి సతీష్, దేవినేని రమేష్, డాక్టర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన షేక్ అబ్దుల్‌సలీం, జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన ఇందూరి శ్రీనివాసరెడ్డి, కుర్రా హరిబాబు, జిల్లా ఇంటిలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన గొట్టిపాటి ఇజ్రాయేల్, కార్యదర్శిగా దివ్వెల రాజశేఖర్, ఐటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన నూతక్కి మనోహర్, కార్యదర్శులుగా గొల్లపూడి మహేష్, గుంటుపల్లి ప్రదీన్, లీగల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాడికొండకు చెందిన దారా తిరుమలరావు, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంజుల భార్గవి, కార్యదర్శులుగా కొమ్ము రాజేశ్వరి, ప్రత్తిపాడుకు చెందిన కరసాల భవానీలను నియమించారు.
జిల్లా పంచాయతీరాజ్ విభాగంలో...
అదేవిధంగా జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శులుగా తాడికొండకు చెందిన బొద్దు చిన్న సాంబశివరావు, ప్రత్తిపాడుకు చెందిన వై.జగన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శులుగా దేవిరెడ్డి సాంబశివారెడ్డి, తాడికొండకు చెందిన కంభంపాటి శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా కంజుల బ్రహ్మారెడ్డి, సాతులూరి సురేష్, మువ్వా శ్రీదేవి, జిల్లా పబ్లిసిటీ విభాగం ప్రధాన కార్యదర్శులుగా తాడికొండకు చెందిన షేక్ అబ్దుల్లా, ప్రత్తిపాడుకు చెందిన లింగా సాగర్, కార్యదర్శులుగా బండారు రాజేష్, దాసరి శివాంజనేయులు, సంకూరి రత్తయ్య, కూచిపూడి విద్యాసాగర్, ఎగ్జిక్యూటీవ్‌మెంబర్లుగా మేదరమెట్ల సుధాకర్, షేక్ సుభాని, జిల్లా ఆర్టీఐ విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఏరువ శౌరిరెడ్డి, కార్యదర్శిగా మిక్కిలి ప్రేమ్‌కుమార్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా చెవుల కృష్ణమోహన్, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షుడు గా మంగళగిరికి చెందిన కర్రి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కొరిటెపాటి రాంబాబు, కార్యదర్శులుగా కొలకలూరి నందకిషోర్, పచ్చల రాజు, షేక్ రఫీ, ఎస్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడికొండకు చెందిన రాపూరి మహేంద్రబాబు, కార్యదర్శిగా కొమరగిరి సూరిబాబు, జిల్లా విద్యార్థి విబాగం ప్రధాన కార్యదర్శిగా కంచర్ల రాజు, కార్యదర్శిగా జి.కామేశ్వరరావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా షేక్ బాజీ, వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండవీటి మగ్బుల్, కార్యదర్శిగా కాకర్ల నాగేశ్వరరావు, వలంటీర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా రాయపూడి సాగర్‌బాబు, కాళహస్తి భవానీ శంకర్, కార్యదర్శిగా తియ్యగూర అంజిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా షేక్ ఖాదర్‌వలి, వీవర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి జోసఫ్, కార్యదర్శిగా షేక్‌జాన్‌బాషా, వైఎస్సార్ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పి.శ్రీనివాసరెడ్డి, గుంటూరు వెస్ట్‌కుచెందిన నల్లమోతు విజయసాగర్, కార్యదర్శిగా కలవకొల్లు నరసింహారావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా యాదాల వీరవసంతరావులను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.