
ఏకంగా బస్ షెల్టరుకే ఎసరు
బస్ షెల్టర్‌ను దుకాణాలుగా మార్చిన దృశ్యం
మంగళగిరి టౌన్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నిడమర్రులో ఓ ప్రభుత్వ స్థలంలో బంధువుల జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. 1978లో పాములపాటి రంగారెడ్డి, వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన శివారెడ్డి దీన్ని నిర్మింపజేశారు. 2024 జూన్ 5వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చాక బస్ షెల్టర్ ఏర్పాటు చేసిన వారి సంబంధికులు దానిని టీడీపీ కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని తొలగించి, మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి బస్ షెల్టర్ ఏర్పాటు చేయిస్తామని కొంతమంది టీడీపీ నాయకులు చెబుతున్నారు.

ఏకంగా బస్ షెల్టరుకే ఎసరు