
పూర్వీకులు ఇచ్చిన గొప్ప వరం
యోగా మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరమని చెప్పాలి. సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఇది ఉంటుంది. ప్రపంచ దేశాల్లో యోగా శిక్షణ ఇచ్చే గురు వులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మన అదృష్టమేమిటంటే ప్రతి పేటకు ఒక శిక్షకుడు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి. దీనివల్ల మంచి అలవాట్లు, శరీరంపై అవగాహన వస్తుంది. ఒక వైద్యుడిగా నేను నా పేషెంట్లకు యోగ సాధన చేయమనే చెబుతాను. నేను కూడా క్రమం తప్పకుండా చేస్తాను.
–డాక్టర్ ఓరుగంటి వెంకట రమణ, హోమియో వైద్య నిపుణులు