హోర్మోన్ల ఉత్పత్తి పెంపొందిస్తుంది
మన శరీరాన్ని నడిపించే హార్మోన్ల స్థితిని యోగా అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం సమాజంలో మధుమేహం, రక్తపోటు, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ తరచుగా చూస్తున్నాను. మన ఆరోగ్యం మారాలంటే జీవన శైలి మార్చుకోవాలి. మిత ఆహారంతో పాటు వాకింగ్, యోగా, మెడిడేషన్ చేయాలని తరచూ నా పేషెంట్లకు చెబుతుంటాను. ఇప్పటికీ కొందరు యోగ సాధనతో ఇన్సులిన్ నుంచి విముక్తి పొందిన వారున్నారు. యోగాను నిరంతరం సెలబ్రెటీలు కూడా ప్రమోట్ చేస్తుండాలి. జీవన శైలిని మార్చుకుని యోగా సాధన చేస్తే నూటికి 90 శాతం రోగాల నుంచి బయటపడవచ్చు. కొన్ని వేల సంవత్సరాల కిందట పతంజలి మహర్షి మన దేశానికి అందించిన గొప్ప వరం యోగా.
–డాక్టర్ కె.సుబ్బారావు,
ఎండో క్రైనాలజిస్ట్


