నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

నిర్ల

నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష

నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు జిల్లా పరిషత్‌ ద్వారా అందించాల్సిన ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 35 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న సీనియర్‌ ఉపాధ్యాయులతో అధిక మార్కుల సాధనకు దోహదం చేసేలా రూపొందించిన మెటీరియల్‌ను జెడ్పీ పాలకవర్గానికి విద్యాశాఖాధికారులు అందజేశారు. అయినప్పటికీ జనవరి వస్తున్నా పంపిణీకి నోచుకోలేదు. గత వైస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వరుసగా రెండేళ్లు ‘జగనన్న విద్యాజ్యోతి’ పేరుతో నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ రూపొందించి సకాలంలో పంపిణీ చేశారు. ఇప్పుడు జెడ్పీ పాలకవర్గం చతికిలబడింది. 2022 నవంబరులో రూ.61.80 లక్షల జెడ్పీ నిధులతో రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా 36,155 మంది విద్యార్థులకు, 2023లో రూ.70 లక్షల వ్యయంతో 39 వేల మంది విద్యార్థులకు మెటీరియల్‌ అందజేశారు.

ఎస్సీఈఆర్టీ మోడల్‌ పేపర్లే దిక్కు

మార్చి 16వ తేదీ నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు జరగనుండటం, జెడ్పీ నుంచి స్టడీ మెటీరియల్‌ అందకపోవడంతో ఎస్సీఈఆర్టీ సిద్ధం చేసిన మోడల్‌ పేపర్లే దిక్కయ్యాయి. ఎస్సీఈఆర్టీ మోడల్‌ పేపర్లను పలువురు హెచ్‌ఎంలు పుస్తక రూపంలో ముద్రించారు. వీటితోపాటు అవే పేపర్లను జిరాక్స్‌లు తీయించి పాఠశాలల్లో విద్యార్థులతో చదివిస్తున్నారు. జెడ్పీ నుంచి స్టడీ మెటీరియల్‌ను ఆలస్యంగా పంపిణీ చేయడం వలన విద్యార్థులకు ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌

విద్యార్థులకు ఏటా ఉచిత మెటీరియల్‌

ఈ ఏడాది ప్రశ్నార్థకంగా పంపిణీ

గత వైఎస్సార్‌ సీపీ పాలనలో

నిరాటంకంగా అందజేత

ఉమ్మడి గుంటూరు జిల్లాలో

35 వేల మంది విద్యార్థులు

‘అల్పాహారం’ కూడా లేక అవస్థలు

గత ప్రభుత్వంలో నిరాటంకంగా..

అర్ధాకలితో హాజరవుతున్న విద్యార్థులు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సిద్ధమవుతున్న విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్‌, అదనపు తరగతులకు వారు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో నెట్టుకువస్తున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయల్దేరి వస్తున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు తరగతులను నిర్బంధంగా అమలు చేస్తోంది. వారి ఆకలిని మాత్రం మరిచిపోయింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 186 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, సోషల్‌, బీసీ వెల్ఫేర్‌ పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 10,384 మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గతేడాది కూడా జిల్లా పరిషత్‌ ద్వారా నెల రోజులు మాత్రమే అమలు చేశారు. విద్యార్థికి రూ.10 చొప్పునే కేటాయించారు. ఈ సారి కనీసం ఎటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. మరోవైపు అధికారుల హెచ్చరికలు, ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు.

చంద్రబాబు పాలనలో పదో తరగతి విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉత్తీర్ణత శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు... బాలలకు ఆ మేరకు వసతులు కల్పించడంలో చేతులెత్తేసింది. కనీసం ప్రణాళిక కూడా లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తూ విద్యార్థులను అర్ధాకలితో అలమటింపజేస్తోంది. స్టడీ మెటీరియల్‌ ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. అదనపు తరగతులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలోనే ఉంటున్న విద్యార్థులకు అల్పాహారం పెట్టడానికీ చంద్రబాబు సర్కారుకు మనసు కూడా రావడం లేదు.

నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష 1
1/1

నిర్లక్ష్య పాలనలో విద్యార్థులపై కక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement