● విద్యార్థుల్లేక మూత‘బడి’ంది..!
విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల మూతబడింది. మండల కేంద్రం
పెదనందిపాడులోని ఉర్దూ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తాత్కాలికంగా విద్యాశాఖ అధికారులు బడిని మూసేశారు. ఒక్క టీచర్‌నూ మండల విద్యాశాఖ అధికారులు వేరే
పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపారు. పిల్లలను చేర్పించడంపై దృష్టి
సారించకపోవడంతో ఈ దుస్థితి పట్టిందని స్థానికుల నుంచి విమర్శలు
వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంటున్నారు. – ప్రత్తిపాడు


