నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి | - | Sakshi
Sakshi News home page

నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

Jun 21 2025 3:35 AM | Updated on Jun 21 2025 3:35 AM

నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ

లక్ష్మీపురం: అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కొత్తపేటలోని నారాయణ జూనియర్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాసర్‌జీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపు కూడా లేదని ఆరోపించారు. అధిక ఫీజుల దోపిడీలకు పాల్పడుతున్నారని, తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు పర్మిషన్‌ లేకుండా కళాశాల నిర్వహిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్‌ రఘువీర్‌ మాట్లాడతూ ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అక్రమాలకు పాల్పడున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్‌ , ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్‌, అమర్‌నాథ్‌ , నగర సహాయ కార్యదర్శి వెంకట్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement