
రేషన్ కార్డ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
నెహ్రూనగర్: జిల్లాలో రైస్ కార్డులకు సంబంధించి నూతన కార్డుల మంజూరు, చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పు, విభజన, తొలగింపు, సరెండర్, అప్‌డేషన్ వంటి సర్వీసుల దరఖాస్తులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని గోరంట్ల 183వ వార్డు సచివాలయంలో రైస్ కార్డు దరఖాస్తుల సర్వీసులను పరిష్కరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. రైస్ కార్డు మాడ్యూవల్‌లో నమోదు చేసే విధానాన్ని డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కంప్యూటరులో పరిశీలించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుల ఈకేవైసీ చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రముని, తూర్పు మండల తహసీల్దారు సుభాని, సివిల్ సప్లయిస్ డీటీ భాస్కర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించండి
గుంటూరు వెస్ట్: ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటు అవసరమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారిని ప్రోత్సహించాలన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ