
మద్యం దుకాణాలు సమయపాలన పాటించాల్సిందే
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని బార్ అండ్ రెస్టారెంట్‌లు, వైన్ షాపులు తప్పనిసరిగా సమయపాలన పాటించాల్సిందేనని ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని మద్యం షాపులు రాత్రి 10 గంటలకు కచ్చితంగా మూసేయాల్సిందేనన్నారు. 10 గంటలకు వైన్ షాపులను మూసేలా ఎకై ్సజ్ సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. పర్మిట్ రూములు నిర్వహణకు అనుమతి లేదని, ఎవరైనా పర్మిట్ రూములల్లో మద్యం తాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లు కూడా రాత్రి 11 గంటల వరకు లిక్కర్ సరఫరా, ఆ తరువాత గంట వరకు ఫుడ్ సరఫరాకు అనుమతి ఉందని చెప్పారు. అనంతరం తప్పనిసరిగా మూసివేయాల్సిందేనన్నారు. సమయ పాలనపై ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. వీరిపై ఎకై ్సజ్ సూపరింటెండెంట్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించే షాపుల లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,900 కేసులు నమోదు చేసి 1,201 మందిని అరెస్టు చేశామన్నారు. ఇందులో మద్యం 2,297 లీటర్లు, బీరు 119 లీటర్లు, నాటు సారా 444 లీటర్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి 2.89 గ్రాములు, కొకై న్ 8.5 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి మొత్తం 21 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్‌రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు పాల్గొన్నారు.
వైన్ షాపులు రాత్రి 10 గంటలకు మూసేలా ఎకై ్సజ్ సిబ్బంది పర్యవేక్షణ అనధికార పర్మిట్ రూమ్‌లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు విలేకరుల సమావేశంలో ఎకై ్సజ్ శాఖడెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్