చంద్రబాబు అబద్ధాలకోరు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అబద్ధాలకోరు

Apr 22 2025 12:54 AM | Updated on Apr 22 2025 12:54 AM

చంద్ర

చంద్రబాబు అబద్ధాలకోరు

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
100 రకాల మొక్కల పెంపకం లక్ష్యం
● 58 ఏళ్ల వయస్సులో కార్డియాలజీ పీజీ పూర్తి చేసిన గుంటూరు వైద్యుడు ● గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరుదైన రికార్డు ● నాలుగు పీజీలు పూర్తి

దక్షిణ భారతంలోనే తొలి పార్కు

40 రకాల పైకస్‌ జాతుల మొక్కలు, చెట్ల పెంపకం

నిర్వహణను గాలికొదిలేసిన మున్సిపాలిటీ

కనీసం మొక్కలకు నీరు పెట్టని నిర్లక్ష్యం

పార్కు మొత్తం అడవిని తలపిస్తున్న గడ్డి

అందమైన లైట్లు చోరుల పాలు

నిర్లక్ష్యానికి నిలువెత్తు చిరునామా

తెనాలి: ఆంధ్రా ప్యారిస్‌లో అరుదైన పైకస్‌ పార్కు అది. ఇప్పుడు లోపలకు ప్రవేశించగానే అడవిని తలపిస్తోంది. పార్కు మొత్తం మోకాలి ఎత్తులో పెరిగిన గడ్డి, అడుగు తీసి అడుగు పెట్టేందుకు అవకాశం లేనట్టుగా ఉంది. పార్కులోని దారుల్లోనూ గడ్డి వ్యాపించింది. అక్కడి అరుదైన జాతుల మొక్కలకు కనీసం నీరు కూడా పోయడం లేదు. విద్యుద్దీపాలు అదృశ్యమయ్యాయి. ఓపెన్‌ జిమ్‌లో వ్యాయామ పరికరాలు వృథాగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కళావిహీనమైన స్థితిలో ఉన్న పార్కు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉంది.

వంద రకాల పైకస్‌ జాతుల మొక్కలు

దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేనటువంటి పైకస్‌ పార్కు ఇది. దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి వంద రకాల పైకస్‌ జాతుల మొక్కలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆరంభించారు. మరుగుజ్జు వృక్షాలు, ఆయా జాతుల సాధారణ రకాల మొక్కలను నాటించారు. వివిధ ప్రాంతాల్లోని సుదీర్ఘ జీవితకాలం కలిగిన వృక్షాలను సైతం యంత్రాల సాయంతో ట్రాన్స్‌లోకేషన్‌ చేసి, ఇక్కడ నాటారు. మొత్తంమీద 40 జాతుల మొక్కలు, చెట్లతో పార్కుకు కళ తీసుకొచ్చారు. సందర్శకుల కోసం వాకింగ్‌ ట్రాక్‌, షటిల్‌ కోర్ట్‌, మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా జిమ్‌లు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ తదితర హంగులను ఏర్పాటుచేశారు.

2017లో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ గ్రీనరీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రమోహనరెడ్డి ఆలోచనల్లోంచి పైకస్‌ పార్కు 2017లో తెనాలిలో సాకారం కావటం విశేషం. పట్టణానికి ఉత్తరం వైపున విజయవాడ రహదారి పక్కన తూర్పు కాలువ అంచున గల మున్సిపల్‌ మంచినీటి పథకం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద సువిశాలమైన మూడు ఎకరాల స్థలాన్ని ఇందుకోసం ఎంచుకున్నారు. నీటి లభ్యత అందుబాటులో ఉండటంతో అనువైనదిగా భావించారు. కేంద్ర ప్రభుత్వ అమృత పథకం, మున్సిపాలిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తారు. ఏపీ గ్రీన్‌ కార్పొరేషన్‌ తగిన మొక్కలను ఎంచుకుని, దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి సేకరించి, మున్సిపాలిటీకి అందజేస్తుంది. వాటిని నాటించి, సంరక్షించటం మున్సిపాలిటీ బాధ్యత.

ఎండిపోతున్న మొక్కలు

విద్యుత్‌ సమస్యతో కనీసం మొక్కలకు నీరు పెట్టటం లేదు. కనీసం వాచ్‌మెన్‌, ల సంరక్షకుడు కూడా లేరు. విద్యుద్దీపాలు చోరులపరమై స్తంభాలు మొండిగా దర్శనమిస్తున్నాయి. వాకింగ్‌ ట్రాక్‌ కనిపించటం లేదు. జిమ్‌ పరికరాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ గ్యాలరీని మొండిగోడలను తలపిస్తున్నాయి. రూ.లక్షలు వ్యయం చేసి, ఏర్పాటుచేసిన పార్కును ఎందుకూ పనికిరాకుండా చేసేంత నిర్లక్ష్యం ఎందుకో అర్థంకాదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. కొసమెరుపు ఏమంటే, ‘సాక్షి’ ఫొటోలు తీశాక పొక్లయిన్‌తో గడ్డిని తొలగింపజేస్తున్నారు.

దయనీయస్థితిలో పైకస్‌ పార్కు

ఏపుగా పెరిగిన గడ్డి

న్యూస్‌రీల్‌

పైకస్‌ అంటే మర్రి జాతుల మొక్కలని అర్థం. రావి, మర్రి, జువ్వి, మేడి...తదితర రకాల మొక్కలతో కూడిన పార్కు ఇది. పైకస్‌ జాతి మొక్కలు దేశవ్యాప్తంగా విస్తారంగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో 17 రకాలు మాత్రమే ఉన్నాయని అంచనా. ఈ కొరతను నివారించి, కనీసం 100 రకాల మొక్కలను ఒకేచోట పెంచాలనేది ఈ పార్కు ఏర్పాటు లక్ష్యం. నాటి మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. నలభై ఏళ్ల వయసు కలిగిన రెండు మర్రి వృక్షాలను తెనాలి పరిసరాల్లోంచి యంత్రాలతో పెకలించి, పార్కులో నాటించారు. వీటితో పాటు ఎక్కువ వయసు కలిగిన బోన్సాయ్‌ (మరుగుజ్జు) వృక్షాలనూ రప్పించారు. పైకస్‌లోనే ఇతర జాతుల మొక్కలు తెప్పించారు. సందర్శకుల కోసమని ‘స్టాండ్‌ స్టోన్‌ గజబోస్‌’గా పిలిచే గోపురం తరహా కుటీర నిర్మాణాలను రాజస్థాన్‌ వర్కర్లతో చేయించారు. పార్కులో వాకింగ్‌ ట్రాక్‌, షటిల్‌ కోర్టు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా జిమ్‌ పరికరాలను సమకూర్చారు. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌కు అవసరమైన గ్యాలరీ నిర్మించారు. పార్కులో పైకస్‌ జాతిపై పరిశోధకులకు అన్నీ అందుబాటులో ఉండే మినీ ఫారెస్ట్‌గా దీన్ని తయారుచేయాలని భావించారు. మొక్క శాసీ్త్రయనామం, కుటుంబం, స్థానికంగా పిలిచే పేరు సహా వివరాలన్నింటినీ ప్రతి మొక్కపైనా లేబిలింగ్‌ చేయాల్సి ఉంది. ఇంత చక్కటి ఆశయంతో రూపుదిద్దిన పార్కు ఇప్పుడు దయనీయస్థితిలో ఉంది.

చంద్రబాబు అబద్ధాలకోరు 1
1/4

చంద్రబాబు అబద్ధాలకోరు

చంద్రబాబు అబద్ధాలకోరు 2
2/4

చంద్రబాబు అబద్ధాలకోరు

చంద్రబాబు అబద్ధాలకోరు 3
3/4

చంద్రబాబు అబద్ధాలకోరు

చంద్రబాబు అబద్ధాలకోరు 4
4/4

చంద్రబాబు అబద్ధాలకోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement