నుదుటిపై బాయ్‌ఫ్రెండ్‌ పేరుతో టాటూ.. 'బ్రేకప్‌ జరిగితే ఏం చేస్తుందో'?

Women Gets Boyfriend Name Tatooed On Her Forehead - Sakshi

ప్రేమను అనేక రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేయడం.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్రేమను తెలియజేస్తుంటారు. ఇంకొందరు మాత్రం జీవితాంతం గుర్తుండేలా, తమకు నచ్చిన వార్ల పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. తాజాగా ఓ యువతి మాత్రం తన బాయ్‌ఫ్రెండ్‌ పేరును ఏకంగా నుదుటిపై టాటూ వేయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌ నడుస్తోంది. యూత్‌కి టాటూలపై వీపరీతమైన క్రేజ్‌.సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్‌ వేయించుకుంటున్నారు. కొందరు జీవితకాలం జ్ఞాపకంలా ఉండాలని తమ ప్రియమైన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫోటోలను కూడా టాటూలుగా వేయించుకోవడం ఇప్పటి వరకు చాలా చూశాం.

కానీ యూకేకు చెందిన ఓ యువతి తన ప్రియుడిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్నంగా ఆలోచించి ఏకంగా నుదుటిపై పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సదరు యువతి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'పిచ్చి పది రకాలు అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది, అయినా ఒకవేళ నీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక్‌ప్‌ అయిపోతే ఏం చేస్తావ్‌' అంటూ వ్యంగంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరికొందరేమో.. నిజాయితీ ఉన్న ప్రేమకు ఇలాంటి స్టంట్లు చేయాల్సిన అవసరం ఏముంది? అయినా టాటూ ఫిల్లింగ్‌ చూస్తుంటే ఇది ఫేక్‌ వీడియోలా ఉంది. పబ్లిసిటీ కోసం ఇలా చేసిందేమో అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై ఆమె స్వయంగా స్పందిస్తూ.. ''ఇది నిజంగా పచ్చబొట్టు. నా బాయ్‌ఫ్రెండ్‌పై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇలా టాటూ వేయించుకున్నా.

అయినా మీరు అనుకున్నట్లు మాకు బ్రేకప్‌ జరగదు. ఎందుకంటే కెవిన్‌(బాయ్‌ఫ్రెండ్‌ పేరు)తో నేను చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నాను.  అద్దంలో నా ముఖం చూసుకున్న ప్రతీసారి కెవిన్‌ నాతోనే ఉన్నట్లు చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు లేని ఇబ్బంది మీ అందరికి ఏంటో'' అంటూ ట్రోలర్స్‌కి గట్టిగానే బదులిచ్చింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top