టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!!

UK Company Offeres 25 Lakhs Salary Job For Only Watching TV And Sleeping On Bed - Sakshi

బెడ్‌ మీద కూర్చుని టీవీ చూస్తూ, హాయిగా నిద్రపోయే ఉద్యోగం ఏదైనా ఉంటే బాగుండు అని మీకెప్పుడైనా అనిపించిందా?  అలాంటి ఉద్యోగం ఒకటుందండీ! నెలకు ఏకంగా రూ. 25 లక్షల రూపాలయలు జీతం కూడా. ఈ విధమైన ఉద్యోగాలు ఇచ్చేందుకు ఓ యూకే కంపెనీ ముందుకొచ్చింది. ఇది కల కాదు.. నిజంగానే..! మీరే తెలుసుకోండి..

బిటన్‌ (యూకే)కు చెందిన ఈ కంపెనీ ఉద్యోగం కావాలని వచ్చిన వాళ్లకు కేవలం బెడ్‌ మీద గడిపితే చాలు జీతం ఇస్తానని చెబుతోంది. బెడ్‌పై కూర్చుని, ఇష్టమొచ్చినంతసమయం టీవీ చూసి, తర్వాత హాయిగా నిద్రపోతే చాలు జాబ్‌ సిన్సియర్‌గా చేసినట్లే. ఓ లగ్జరీ బెడ్‌ కంపెనీ ఈ ఆఫర్‌ అందిస్తోంది.

చదవండి:ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..!

అధికారిక సమాచారం ప్రకారం ఈ కంపెనీలో జాయిన్‌ అయిన ఉద్యోగి రోజుకు 6 -7 గంటలు బెడ్‌ పై గడపవల్సి ఉంటుంది. బెడ్‌పై పడుకుని మ్యాట్రెస్‌ను పరీక్షించి, సమీక్ష చేయడం సదరు ఉద్యోగి పని. ఈవిధంగా వారానికి కనీసం 37.5 గంటలు పరుపుపై గడిపి తన అనుభవాలను వివరించాలి. ఈ పనికి గాను నెలకు 24 లక్షల 79 వేల రూపాయలు జీతంగా ఇస్తుంది ఈ కంపెనీ.

అంతేకాదు ఈ ఉద్యోగం చేయడానికి కష్టపడి ట్రావెల్‌ చేసి రోజూ కంపెనీకి వెల్లవల్సిన అవసరం కూడా లేదు. ఇంటికే కంపెనీ వాళ్లు బెడ్‌ పంపిస్తారు. ఇంట్లో బెడ్‌పై గడిపితే చాలు అంటున్నారు క్రాఫ్టెడ్ బెడ్స్ మార్కెటింగ్ మేనేజర్ బ్రియాన్ డిల్లాన్. ఐతే ఈ ఉద్యోగం చేయాలంటే బ్రిటిష్ పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలట. ఇంత విచిత్రమైన ఉద్యోగాలు మన దేశంలో కూడా ఉంటే ఎంతబాగుంటుందో కదా!!

చదవండి: Health Tips: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. తింటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top