Sinus Infection Home Remedy in Telugu: Top 5 Home Remedies for Sinusitis - Sakshi
Sakshi News home page

సతమతం చేసే సైనసైటిస్‌ నుంచి ఇలా ఉపశమనం పొందండి..

May 14 2022 3:20 PM | Updated on May 14 2022 3:25 PM

Tips To Get Relief From Sinusitis - Sakshi

Sinusitis Home Remedies: ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని లేకుండా చాలా మందిని పీడించే సమస్య సైనసైటిస్‌. తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్‌ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచు తిరగబెట్టే ఈ సమస్యకు నివారణ మార్గాలు తెలుసుకుందాం.

వైరస్, బాక్టీరియా, ఫంగస్‌ కారణంగా వచ్చే సైనస్‌ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి.

  • ఉల్లి, వెల్లుల్లి రేకులను తింటే సైనసైటిస్‌ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.
  • మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
  • టీ స్పూన్‌ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్‌ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
  • 250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్‌ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగుసార్లు తీసుకోవాలి.
  • 300 మిల్లీ లీటర్ల క్యారట్‌ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒకసారి తాగాలి.
  • దీర్ఘకాలంగా ఉండే సైనసైటిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.. అయితే కారం టీ సైనస్‌ నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఓ కప్పు మరిగించిన నీళ్లలో అర టీస్పూను కారం, రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా రోజుకి రెండుసార్లు తాగితే సైనస్‌ నుంచి ఉపశమనం కలుగుతుందట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement