Mountaineer Amgoth Tukaram: మట్టిలో మాణిక్యాలకు వెలుగు ‘సాక్షి’

Sakshi Excellence Awards: Special Recognition Sports Male Amgoth Tukaram

సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డులు

Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్‌ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌’ (స్పోర్ట్స్‌– మేల్‌) అవార్డును పర్వతారోహకుడు అమోఘ్‌ తుకారాం అందుకున్నారు.

అమోఘ్‌ తుకారం‘జ్యూరీ స్పెషల్‌ రికగ్నిషన్‌’ (స్పోర్ట్స్‌– మేల్‌)
ఇరవై ఏళ్ల వయసులో.. పది నెలల వ్యవధిలో.. నాలుగు ఖండాల్లో..  ఎనిమిది శిఖరాలు అధిరోహించాడు అమోఘ్‌ తుకారాం. ప్రతి అధిరోహణ.. ఒక సందర్భం. ఒక సందేశం. ఒక సంకేతం. పర్వతారోహకులలో ప్రత్యేకం అమోఘ్‌ తుకారాం. ఎవరెస్టు శిఖరాన్ని సౌత్‌ కోల్‌ రూట్‌ గుండా ఎక్కడం ప్రమాదకరమైనా, ఈ దుస్సాహసం చేసి, విజయుడై నిలిచిన యంగెస్ట్‌ పర్సన్‌. ఆదివాసీ రైతు బిడ్డగా పుట్టి, పర్వత పుత్రుడిగా ప్రఖ్యాతి చెందిన ఈ యువ ఉత్తుంగ తరంగంది తెలంగాణా, రంగారెడ్డి జిల్లాలోని యాచారం. 

మట్టిలో మాణిక్యాలకు వెలుగు సాక్షి
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడంలో సాక్షిదే అగ్రస్థానం. ఈ తరహా స్ఫూర్తిని అందించడం ద్వారా మరెందరో వెలుగులోకి వస్తారని భావిస్తున్నాను. సాక్షికి ధన్యవాదాలు. ముఖ్యంగా వై.ఎస్‌. భారతీరెడ్డిగారి నిరాడంబరత, ఆత్మీయ పూర్వక ప్రోత్సాహం నన్ను చాలా ఆనందాశ్చర్యాలకు గురిచేశాయి. వారికి ఎంతైనా రుణపడి ఉంటాను. 
– అమోఘ్‌ తుకారాం, పర్వతారోహకుడు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top